Advertisementt

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలో ట్విస్ట్

Sun 02nd Mar 2025 01:36 PM
sankranthiki vastunnam  సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలో ట్విస్ట్
Sankranthiki Vastunnam OTT Twist: 8 Minutes of Content Cut from Theatrical Version సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలో ట్విస్ట్
Advertisement
Ads by CJ

ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలోనే కాకుండా డైరెక్ట్‌గా టీవీ ప్రీమియర్‌గా కూడా ఒకేసారి టెలికాస్ట్‌కు తీసుకొచ్చారు. అయితే ఓటీటీలోకి రాకముందు ఎన్ని ట్విస్ట్‌లు ఇచ్చారో, ఇప్పుడు ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఆ ట్విస్ట్ ఏంటని అనుకుంటున్నారా?

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలో థియేట్రికల్ నిడివి కంటే దాదాపు 8 నిమిషాలు తక్కువగా ఉంది. మరి కావాలని చేశారో, ఆ కంటెంట్ అవసరం లేదని కట్ చేశారో తెలియదు కానీ, ఈ విషయం గమనించిన వారు మాత్రం షాక్ అవుతున్నారు. వాస్తవానికి, ఇలాంటి సినిమాలు ఓటీటీలలో వస్తున్నాయంటే, ఇంకాస్త ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ చేసి లోడ్ చేసి ఉంటారని అనుకుంటారు. కానీ ఉన్నదానినే కట్ చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. 

ఓటీటీ విడుదలకు ముందు ఇంకొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సీన్లు యాడ్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కట్ చేస్తే, ఉన్న సినిమాలోనే 8 నిమిషాల నిడివిని తగ్గించారు మేకర్స్. మరి ఈ ట్విస్ట్‌పై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Sankranthiki Vastunnam OTT Twist: 8 Minutes of Content Cut from Theatrical Version:

Sankranthiki Vastunnam OTT Debut Comes with a Surprising 8-Minute Cut  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ