చాలామంది సౌత్ హీరోయిన్స్‌కి ఫైనల్ టార్గెట్, కల అన్ని హిందీ మార్కెట్ పైనే ఉంటాయి. బాలీవుడ్‌లో వెలిగిపోవాలి, బాలీవుడ్ లోనే ఉండిపోవాలి, అక్కడ సక్సెస్ అయితే ఎదురే లేదు అని అనుకుంటారు. కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుని అయితే ఓకే లేదంటే వెనక్కి వచ్చేస్తారు. గతంలో కాజల్, త్రిష లాంటి వాళ్ళు అలా వెళ్ళొచ్చినవాళ్ళే.
కానీ కొంతమంది సక్సెస్ కోసం అక్కడే ఉండిపోతారు. మరికొంతమంది సౌత్ క్రేజ్‌ను తిరిగి వాడుకుంటారు. అలా ఇలియానా లాంటి వాళ్ళు ముంబైలోనే ఉండిపోయారు. తాజాగా సౌత్ లో టాప్ 1 పొజిషన్ కి చేరి ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఇకపై బాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతుందేమో, ముంబైలోనే ఉండిపోతుందేమో అంటూ ఆమె అభిమానులే మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే హిందీ సినిమాల కోసం సౌత్ సినిమాలను పక్కనపెడుతున్న రష్మిక కేవలం పాన్ ఇండియా ఫిలిమ్స్ ని మాత్రమే సౌత్ లో చూజ్ చేసుకుంటుంది. అటు హిందీలో వరస హిట్లు అమ్మడు రేంజ్ పెంచెయ్యడం, ఇటు సౌత్ ని లైట్ తీసుకోవడం చూసిన వారు రష్మిక హైదరాబాద్ నుంచి త్వరలోనే ముంబై కి షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.