90స్ బ్యూటీ. పరిచయం అక్కరలేని పేరు రంభ. ఒకప్పుడు అందంతో, ఐటమ్ సాంగ్స్‌తో ఉర్రూతలూగించిన ఈ నటి, పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పింది. మధ్య మధ్యలో టీవీ షోలలో కనిపించినా, నటిగా మాత్రం ముఖానికి రంగేయలేదు. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంభ సిద్ధమైంది.
అందానికి అందం, హుందాతనం, చక్కని నటనా ప్రతిభ, అదరగొట్టే డ్యాన్స్ ఇవన్నీ రంభకు అలంకరణలు. అలాంటి నటి రీ ఎంట్రీ ఇస్తానంటే ఎవరు మాత్రం వదిలిపెడతారు. ఆల్రెడీ రంభను తమ సినిమాలలో నటించాలని, ఇప్పటికే కొందరు ఆమె కోసం క్యూ కట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మధ్య వచ్చిన ఓ సినిమాలో రంభనే నటించాలి. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం వేరొకరికి పోయింది. ఇప్పుడు మాత్రం సాలిడ్ రీ ఎంట్రీ కోసం రంభ వేచి చూస్తుంది.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. సినిమా అనేది ఎప్పుడూ నా ఫస్ట్ లవ్. ఈ రీ ఎంట్రీలో ఛాలెంజింగ్ పాత్రలను పోషించేందుకు ఎంతగానో వేచి చూస్తున్నాను. మంచి పాత్రలు, అర్థవంతమైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులలో మరోసారి స్థానం సంపాదించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. చూద్దాం, రంభ రీ ఎంట్రీ, ఆ తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో..