అవును ఈ ఏడాది రెండు నెలలను మామా-అల్లుళ్లే నిలబెట్టారు. జనవరి నెలను విక్టరీ వెంకటేష్ నిలబెడితే, ఫిబ్రవరి నెలను అల్లుడు నాగ చైతన్య నిలబెట్టాడనే చెప్పాలి. జనవరిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదల కాగా.. అందులో గేమ్ చేంజర్ మాటల్లో లేకుండా పోయింది. డాకు మహారాజ్ జస్ట్ బ్రేక్ ఈవెన్‌తో సరిపెట్టుకుంది.
కానీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం థియేటర్స్ లో దుమ్ము దులిపేసింది. జనవరి లో కాదు 2025 ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. థియేటర్స్ లో అదిరిపోయే హిట్ అయిన ఈ చిత్రం ఈ శనివారం టీవీ, ఓటీటీ ప్రీమియర్స్‌గా బుల్లితెర మీదకు రాబోతుంది.
ఇక ఈ నెల ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చిన తండేల్‌తో నాగ చైతన్య తన కెరీర్‌లోనే 100 కోట్లు కొల్లగొట్టాడు. నాగ చైతన్య-సాయి పల్లవిల తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుని రూ. 100 కోట్లు కొల్లగొట్టింది. అలా ఫిబ్రవరి నెలను చైతు నిలబెట్టాడు. సో జనవరిని మామ వెంకీ నిలబెడితే, ఫిబ్రవరి నెలను అల్లుడు నాగ చైతన్య ఆదుకున్నాడన్నమాట. మరి మార్చి నెల ఎవరిదో వెయిట్ అండ్ సీ..