రాజకీయాల్లోకి వచ్చాక కార్యకర్తలు, అభిమానుల వలన అంచెలంచెలుగా పైకి ఎదిగి ఒక పొజిషన్ కి రాగానే ప్రజలను అడ్డం పెట్టుకుని రోడ్డు కాంట్రాక్టుల్లోనో లేదంటే లిక్కర్ పాలసీల్లోనో, మారేదన్నా స్కామ్స్ చేసుకుంటూ డబ్బు సంపాదించడమనేది పరిపాటిగా మారిపోయింది. ఒకరు అధికారం చేపట్టగానే ప్రతి పక్షంలో ఉన్నవాళ్లను భయపెట్టి కేసుల్లో ఇరికించడం, అధికారం పోగానే పార్టీలు మారడం అబ్బో రాజకీయనాయకులకు అస్సలు నీతి నిజాయితీ అనేది లేకుండా పోతుంది.
ఇలాంటి స్కామ్స్ చేసి డబ్బు వెనకేసుకోవడం, లేదంటే అధికారం అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవడం ఇవన్నీ ఓ ఎత్తు కానీ రాజకీయాల్లోకి వచ్చాక విచక్షణ మరిచిపోయి అమ్మాయిలను వాడుకోవడం, వాళ్ళను బెదిరించి లొంగదీసుకోవడం అనేది నిజంగా నీచత్వం. అధికారంలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి పక్షంలో ఉన్నవాళ్లు కూడా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు.
రీసెంట్ గా జనసేన ప్రతినిధి కిరణ్ రాయల్ రాసలీలలు అంటూ మీడియాలో ఆ టాపిక్ ఉన్న సమయంలోనే వైసీపీ నేత అమ్మాయి విషయంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఇదంతా చూసి చాలామంది ఈ రాజకీయనాయకులు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు అనకుండా ఉండలేకపోతున్నారు.