బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను రెండేళ్ళ క్రితమే పేమ వివాహమాడింది. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలతో బిజీ తారగా, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న కియారా అద్వానీ స్టయిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ట్రెండీ దుస్తులతో కియారా అద్వానీ ఇచ్చే కిర్రాక్ ఫోజులకు యూత్ మొత్తం ఫిదా కావాల్సిందే. అందాలు ఆరబోసే విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనే లేదు. జిమ్ వేర్ అయినా, పెళ్లిళ్లయినా, రిసెప్షన్ డ్రెస్ అయినా అందులో అందాలు ఎంత బాగా చూపించవచ్చో వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి అనేట్టుగా ఉంటారు.
తాజాగా కియారా అద్వానీ తాను స్టయిలింగ్ అవుతున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ కాస్ట్యూమ్స్ లో కియారా అద్వానీ స్టైలింగ్ అవుతూ ఆ పిక్స్ ని షేర్ చెయ్యగానే అవి ఇట్టే వైరల్ అయ్యాయి. అందులో కియారా అద్వానీ లుక్ చూసి వారు ఇది కదా గ్లామర్ అంటే అని కామెంట్ చేస్తున్నారు.