గత ఏడాది డిసెంబర్ 5 అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టిన శోభిత దూళిపాళ్ల పెళ్లి తర్వాత ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనలేదు. ఈరోజు శోభిత దూళిపాళ్ల హైదరాబాద్ లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య తో వివాహం తర్వాత కొద్దిరోజుల గ్యాప్ తో ఈ జంట మాల్దీవులకు హనీమూన్ కి వెళ్ళొచ్చింది.
ఆతర్వాత తండేల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో చైతు-శోభితల జంట తొలిసారి పబ్లిక్ ఈవెంట్ లో మెరిశారు. ఫ్యామిలీ ఈవెంట్స్ లో పద్దతిగా చీరకట్టులో కనిపించే శోభిత ఫోటో షూట్స్ కి వచ్చేసరికి మాత్రం మోడ్రెన్ గా మారిపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లో శోభిత నటిస్తుంది. ఆమె నటించే మూవీ వివరాలు తెలియరాలేదు కానీ.. నేడు ఆమె హైదరాబాద్ లో ఓ షూటింగ్ లో పాల్గొన్న పిక్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.