కొన్నాళ్లుగా మలయాళం నుంచి వస్తున్న చిత్రాలు మలయాళంలో కాసులు కురిపించడమే కాదు, మలయాళ ఇండస్ట్రీ కి మంచి పేరు తీసుకొస్తున్నాయి. సింపుల్ స్టోరీస్ తో ఆడియన్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. మలయాళ చిత్రాలు ఓటీటీ ల ద్వారా ఇతర భాషల్లో డబ్ అయ్యి పలు భాషల ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
ఆ లిస్ట్ లో తాజాగా మరో మలయాళ చిత్రం చేరింది. కుంచాకో బోబన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ రీసెంట్ గా విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఫిబ్రవరి 20 న మలయాళంలో విడుదలై నాలుగు రోజులు తిరిగేసరికి బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.
ఆరు రోజుల్లోనే 25 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి మలయాళంలో ఈ ఏడాది అతిపెద్ద గ్రాసర్ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ వారం తిరక్కుండానే 25 కోట్లు కలెక్ట్ చేసింది.