Advertisementt

పుట్టని పిల్లలకు కూడా తప్పని ట్రోల్స్-ప్రియమణి

Thu 27th Feb 2025 04:38 PM
priyamani  పుట్టని పిల్లలకు కూడా తప్పని ట్రోల్స్-ప్రియమణి
Priyamani on interfaith marriage hatred పుట్టని పిల్లలకు కూడా తప్పని ట్రోల్స్-ప్రియమణి
Advertisement
Ads by CJ

నటి ప్రియమణి సౌత్ లో నార్త్ లో బిజీగా లేకపోయినా ఆమెకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ పాపులర్ మూవీస్ లో నటిస్తుంది. బుల్లితెరపై అటు హిందీ ఇటు తెలుగు షోస్ కి జెడ్జి గా చేసిన ప్రియమణి ఈమధ్యన బుల్లితెర పై అస్సలు కనిపించడమే మానేసింది. ఇక కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజం. 

కానీ ప్రియమణి పర్సనల్ లైఫ్ లోను ట్రోల్స్ కి గురవుతుంది. కారణం ఆమె ముస్లిం వ్యక్తిని పెళ్లాడడమే. ముస్తాఫా రాజ్ ని ప్రియ‌మ‌ణి 2017లోనే వివాహం చేసుకుంది. ఎంగేజ్మెంట్ అయ్యి తనకు కాబోయే భర్త ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే త‌న‌కు ఆన్ లైన్ లో ట్రోల్స్ ఎదురయ్యాయ‌ని ప్రియమణి చాలా సందర్భాల్లో చెప్పింది. 

అంతేకాదు ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన విష‌యాన్ని త‌న రిలేటివ్స్ చెప్తే సంతోషిస్తార‌నుకుంటే వారు మాత్రం త‌న‌ను ల‌వ్ జిహాది అంటూ  విమ‌ర్శలు చేసారు. త‌న‌పై లేని పోని ట్రోల్స్ చేస్తున్న వాళ్లు, ఇంకా పుట్ట‌ని పిల్ల‌ల్ని కూడా ఇందులోకి లాగి మ‌రీ మాట్లాడుతున్నార‌ని, పుట్టని పిల్లలపై అలాంటి ట్రోల్స్ చేస్తే బాధగా ఉంటుంది. 

ఇప్పటికే తన భర్త ముస్తఫా తో కలిసి ఉన్న పిక్ పోస్ట్ చెయ్యాలన్నా భయం వేస్తుంది అంటూ ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేసింది. కొన్నాళ్లుగా ప్రియమణి ఫొటోస్ షేర్ చెయ్యకపోవడంతో ఆమె భర్త ముస్తఫా నుంచి విడిపోతుంది అనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ భర్త ఫొటోస్ షేర్ చేయకపోవడానికి అసలు కారణం ఇదన్నమాట అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Priyamani on interfaith marriage hatred:

 Priyamani talks about hatred on her interfaith marriage

Tags:   PRIYAMANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ