నిన్న మహాశివరాత్రి సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ చక్కగా చీర కట్టుకుని బ్యూటిఫుల్ గా ఇచ్చిన ఫెస్టివ్ ఫోజులు వైరల్ గా మారాయి. ఆ శారీ లుక్ లో అనుపమ చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ డ్రాగన్ మూవీతో హిట్ కొట్టింది. ప్రదీప్ రంగనాధన్ హీరోగా రిటన్ ఆఫ్ ద డ్రాగన్ లో అనుపమ పరమేశ్వరన్ నటించింది.
ఆ చిత్రం తెలుగు, తమిళంలో హిట్ అవడంతో అనుపమ ఖాతాలో మరో హిట్ చేరింది. అయితే ఈ చిత్రం హిట్ అయినా అనుపమ పరమేశ్వరన్ పేరు అంతగా వినించలేదు. డ్రాగన్ లో నటించిన మెయిన్ హీరోయిన్ కాయదు లోహర్ కు మాత్రం ఈ చిత్రంతో ఫుల్ గా పాపులర్ అవడమే కాదు ఆమె పేరు టాలీవుడ్ యంగ్ హీరోలు పలువరిస్తున్నారు.
ఇక అనుపమ తాజాగా మహాశివరాత్రి స్పెషల్ గా వదిలిన క్యూట్ అండ్ స్వీట్ శారీ లుక్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.