వైసీపీ ప్రభుత్వంలో జగన్ మెప్పుకోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసారు. వైసీపీ సోషల్ మీడియాపై ఎప్పుడైతే కేసుల పరంపర మొదలైందో అప్పుడే పోసాని కృష్ణమురళిపై కూడా పలు కేసులు నమోదు కావడంతో పోసాని సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు.
తాను ఏ ఒక్కరిని బాధపెట్టేలా మాట్లాడను, అసలు రాజకీయాల్లోనే ఉండను అంటూ రాజకీయ సన్యాసం తీసుకుని తన పని తాను చేసుకుంటున్న పోసాని కృష్ణమురళి ని నేడు రాయదుర్గం లోని మై హోం భుజ అపార్ట్మెంట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసాని అరెస్ట్ అనంతరం ఆయన్ను ఏపీ పోలీసుల రాయచోటి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు .
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందుకున్న పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసి ఈరోజు మహాశివరాత్రి రోజున అరెస్ట్ చేసారు.