కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈమధ్యనే అంటే డిసెంబర్ లోనే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లొచ్చారు. శివరాజ్ కుమార్ కు క్యాన్సర్ అన్న విషయం తెలిసి ఆయన అభిమానులు చాలా కంగారు పడ్డారు. శివ రాజ్ కుమార్ అమెరికాలో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఇండియాకి తిరిగొచ్చారు. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న ఆయన తాజాగా తన ప్రాజెక్ట్స్ అలాగే క్యాన్సర్ విషయమై రియాక్ట్ అయ్యారు.
గత ఏడాది ఏప్రిల్ లో తనకు క్యాన్సర్ అనే విషయం తెలిసింది. చాలా నీరసంగా అనిపించేది, సినిమా షూటింగ్స్ వలన రెస్ట్ లేక అలా అయ్యి ఉంటుంది అనుకున్నాను, ఎంతకీ తగ్గకపోయేసరికి టెస్ట్ లు చేయిస్తే క్యాన్సర్ అనే విషయం బయటపడింది. క్యాన్సర్ అనగానే నేను చాలా ఆందోళన పడిపోయాను,
కానీ ఫ్యామిలీ మెంబెర్స్, అభిమానులు, డాక్టర్లు ఇచ్చిన ధైర్యంతో మళ్లీ మామూలు మనిషిని అయ్యాను. చికిత్స లో భాగంగా కీమోథెరపీ సమయంలో చాలా బలహీనంగా తయారయ్యాను, చాలా నీరసంగా అనిపించేది. కీమో తీసుకుంటూనే కొన్ని షూటింగ్ లో పాల్గొన్నాను. క్యాన్సర్ ట్రీట్ మెంట్ తర్వాత నా డైట్ పై దృష్టి పెట్టాను. అందులో భాగంగా యోగ అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నా లైఫ్ లో యోగ ఒక భాగమైంది.
వచ్చే నెల మొదటి వారంలో తిరిగి సినిమా షూటింగ్స్ తో బిజీ అవుతాను. తెలుగులో రామ్ చరణ్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో నా రోల్ చూస్తే ఎంతో స్పెషల్ గా ఉంటుంది. కొన్ని రోజులు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటాను. అంటూ శివ రాజ్ కుమార్ RC 16 పై క్రేజ్ ని పెంచేశారు.