మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటూ భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో భారీ స్థాయిలో ప్లాన్ చేసిన పరమశివ భక్తుడు కన్నప్ప నుంచి ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక అద్దిరిపోయే అప్ డేట్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసారు.
కానీ కన్నప్ప టీమ్ నుంచి కనీసం ట్రైలర్, టీజర్ కాదుకదా ఓ స్పెషల్ పోస్టర్ కూడా ఇంతవరకు వెలువడకపోవడం ఆశ్చర్యకరం. శివుని భక్తుని సినిమా అంటూ ప్రతి సోమవారం ఓ ప్రత్యేకమైన అప్ డేట్ ఇస్తా అంటూ ప్రకటించిన మంచు విష్ణు ఒక్కో సోమవారం ఒక్కో కేరెక్టర్ ను రివీల్ చేస్తూ పోస్టర్స్ వదిలారు తప్ప అసలు సిసలు మహాశివరాత్రి ని మరిచారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, విలక్షణ నటుడు మోహన్ బాబు, వీరందరితో పాటుగా కన్నప్పకి కర్త, కర్మ, క్రియ అన్ని తానే అయిన మంచు విష్ణు వీరందరి షాట్స్ తో కనీసం ఓ విజువల్ కట్ కన్నప్ప టీమ్ రెడీ చేసి రిలీజ్ చేసి ఉంటే ఆడియన్స్ కి అది విజువల్ ఫీస్ట్ లా ఉండేది, సినిమాపై బజ్ అమాంతం రెట్టింపయ్యేది.
శివరాత్రి లాంటి ఫెస్టివల్ ని సరిగ్గా ఉపయోగించుకోకుండా సరైన అప్ డేట్స్ ఇవ్వకుండా ఇతర సినిమాలు ఉదాసీనంగా ఉండొచ్చేమో కానీ కన్నప్ప మాత్రం ఖచ్చితంగా ఇచ్చివుంటే బావుండేది, వచ్చి ఉంటే సినిమా క్రేజ్ పెరిగేది.
ఎట్టకేలకు ఇప్పుడే కన్నప్ప టీమ్ కదిలింది, వారిలో కదలిక వచ్చింది మార్చి 1 టీజర్ విడుదల అంటూ ఓ ప్రకటన వెలువండింది. అదేదో ఇదే రోజు జరిగుంటే శివరాత్రి రోజున కావలసినంత హైప్ క్రియేట్ అయ్యి ఉండేది. థింక్ విష్ణు.