అపోలో ఆసుపత్రి ఎండి ప్రతాప్ రెడ్డి మనవరాలు, కామినేని ఆసుపత్రి ఎండి కుమార్తె ఉపాసన ను మెగా స్టార్ చిరు కొడుకు స్టార్ హీరో రామ్ చరణ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి అయ్యి 11ఏళ్లకు వీరికి మనవరాలు క్లింకార ను అందించారు చరణ్ దంపతులు. ఇక తాజాగా రామ్ చరణ్ అత్తమామలు 40 వ పెళ్లి రోజు వేడుకలు దుబాయ్ వేదికగా ఘనంగా జరిగాయి.
అత్తమామతో పాటుగా రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కూడా ఎంజాయ్ చేసిన వీడియో ని ఉపాసన షేర్ చేసింది. 40 ఇయర్స్ లవ్ అండ్ టుగెదర్‌నెస్.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మ, నాన్న. మాపై మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ ఆ వీడియో ద్వారా తల్లితండ్రులకు విషెస్ చెప్పింది ఉపాసన.
ఇక రామ్ చరణ్ కుమార్తె క్లింకార ఆ వీడియోలో కనిపించినప్పటికీ ఆ పాప ఫేస్ మాత్రం రివీల్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు. అమ్మమ్మ-తాతయ్య ల పెళ్లి రోజు వేడుకల్లో క్లింకార స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.