Advertisementt

రాజమౌళితో సినిమా మహేష్ ఇన్నర్ ఫీలింగ్

Wed 26th Feb 2025 01:45 PM
mahesh  రాజమౌళితో సినిమా మహేష్ ఇన్నర్ ఫీలింగ్
Rajamouli movie-Mahesh inner feelings రాజమౌళితో సినిమా మహేష్ ఇన్నర్ ఫీలింగ్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఫ్యామిలిమ్యాన్. సినిమా షూటింగ్స్ నుంచి ఏ చిన్న బ్రేక్ దొరికినా ఫ్యామిలీతో సహా ఆయన విదేశాలకు వెళ్ళిపోతారు. కుటుంబంతో తనితీరా గడిపి మళ్ళి పనిలో నిమగ్నమవుతుంటారు. అలాంటి హీరో ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఇరుక్కున్నారు. మరి రాజమౌళి తో సినిమా అంటే రిలాక్స్ అవ్వడానికి సమయం దొరుకుతుందా.. 

ఆర్.ఆర్.ఆర్ ఇంటర్వూస్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్ లు రాజమౌళి వల్ల సఫర్ అయిన విషయాన్ని ఫన్నీగానే చెప్పారు. కానీ అక్కడ వారి కష్టం కనిపించింది. మరి ఇప్పుడు SSMB 29 షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ అప్పుడే తన ఎంజాయ్మెంట్ ని పక్కనపెట్టేశారు. టాలీవుడ్ తారలంతా దుబాయ్ లో సేదతీరుతుంటే మహేష్ మాత్రం రాజమౌళి సెట్స్ లో ఉన్నారు. 

అక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో అలాగే వాళ్ళ వాళ్ళ భార్యలతో మహేష్ వైఫ్ నమ్రత ఫొటోస్ దిగి షేర్ చేస్తే అవి చూసిన మహేష్ తన మనసులో ఏం ఫీలవుతున్నాడో అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్-బ్రహ్మి లు చేసిన కామెడీ సీన్స్ షేర్ చేస్తూ.. ఏంటి రిలాక్స్ అవుతున్నారా గురువుగారు అని ఎన్టీఆర్ అడిగితే నా బ్రతుక్కి రిలాక్సేషన్ కూడానా అంటూ బ్రహ్మి చెప్పిన డైలాగ్ మహేష్ మనసులో అనుకుంటున్నట్లుగా మీమ్స్ రెడీ చేసి కామెడీ చేస్తున్నారు. 

Rajamouli movie-Mahesh inner feelings:

Memes on Rajamouli - Mahesh combo

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ