Advertisementt

మాకు లేని బాధ మీకెందుకు - పవన్ కళ్యాణ్

Wed 26th Feb 2025 11:55 AM
pawan kalyan  మాకు లేని బాధ మీకెందుకు - పవన్ కళ్యాణ్
NDA will be in power for 15 years asserts Pawan మాకు లేని బాధ మీకెందుకు - పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

కూటమి ప్రభుత్వం లో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ల స్నేహాన్ని చూడలేక వైసీపీ నేతలు సతమతమైపోతున్నారు. బ్లూ మీడియా చంద్రబాబు-పవన్ కళ్యాణ్ నడుమ ఎప్పుడెప్పుడు పుల్లలు వేద్దామా అని కాచుకుని కూర్చుంది. చంద్రబాబు పక్కన పవన్ కనిపించకపోతే అదిగో పవన్ కి బాబు కి చెడింది అంటూ ప్రచారం మొదలు పెట్టేస్తుంది. 

పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కావాలనే కొడుకు లోకేష్ కోసం పక్కన పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎదుగుదల చంద్రబాబు చూడలేకపోతున్నారు, అందుకే పవన్ ను సైడ్ చేస్తున్నారు అంటూ బ్లూ మీడియా జనసైనికులను రెచ్చగొడుతుంది. ఈ విషయమై బ్లూ మీడియాకు, వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. 

నిన్న అసెంబ్లీ సెషన్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో మేము మేము కిందా పడ్డా మీదా పడ్డా, నన్ను ఒక మాట అన్నా పర్వాలేదు.. మేమంతా ఎన్డీఏ కూటమి, కలిసి కట్టుగా ముందుకు నడుస్తాం, మా కూటమి మరో 15 సంవత్సరాలు కలిసుంటుంది, 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం. వైసీపీ పార్టీని అధికారంలోకి రానివ్వం అంటూ తెగేసి చెప్పారు. 

మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబే తనని ఒక మాట అన్నా నేను సర్దుకుపోతాను అని చెప్పకనే చెప్పాక వైసీపీ నేతలు కానీ, బ్లూ మీడియా కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి మద్యన పొరపొచ్చాలు సృష్టించే ఛాన్స్ అయితే లేదు అనేది గ్రహిస్తే బెటర్ అంటూ జనసైనికులు వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్ ఇస్తున్నారు. 

NDA will be in power for 15 years asserts Pawan:

Pawan Kalyan - NDA alliance will rule Andhra Pradesh for 15 years

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ