టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో గ్లామరస్ హీరోయిన్ రష్మిక మందన్నా కథానాయికగా నటించిన చిత్రం ఛావా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. హిందీ భాషలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా ఇప్పటికే ₹300 కోట్ల మార్క్ దాటిపోయింది. విడుదలైన రెండు వారాలైనా వసూళ్లలో ఎలాంటి తగ్గుదల లేకుండా ప్రతి వర్కింగ్ డే కూడా స్ట్రాంగ్ హోల్డ్‌తో దూసుకెళ్తోంది. సోమవారం కూడా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ఒక్క రోజులోనే ₹19 కోట్లు పైగా నెట్ వసూళ్లను సాధించి మొత్తం కలెక్షన్ ₹353 కోట్లకు చేరుకుంది. ఈ గణాంకాలతో ఈ చిత్రం త్వరలోనే ₹400 కోట్ల క్లబ్‌లో చేరనుందనే అంచనాలు నెలకొన్నాయి.
ఈ గ్రాండ్ హిస్టారికల్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌లో మరో ఘన విజయంగా నిలిచింది.