నాగ చైతన్య-సాయి పల్లవిల లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం తండేల్ మేకర్స్ కి మంచి లాభాలు తేవడమే కాదు, నాగ చైతన్య కెరీర్ లోనే 100 కోట్ల పోస్టర్ వేసిన చిత్రంగా తండేల్ నిలిచింది. ఫిబ్రవరి 7 న థియేటర్స్ లో విడుదలైన తండేల్ చిత్రం మూడో వారం పూర్తి చేసుకోబోతుంది.
తండేల్ హిట్ అవడంతో నాగ చైతన్య గత ఆదివారం మూవీ టీమ్ తో పాటుగా ఇంకా కొంతమంది సినీ ప్రముఖులకు ఓ పబ్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇక కొద్దిరోజులుగా తండేల్ ఓటీటీ డేట్ పై సస్పెన్స్ నడుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో తండేల్ చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకుంది.
అయితే మార్చ్ మొదటి వారంలో తండేల్ ఓటీటీ లో స్ట్రామింగ్ అయ్యే అవకాశం ఉంది అనే న్యూస్ తో పాటుగా.. ఇప్పుడు మార్చ్ 7 నుంచి తండేల్ నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు రావడం పక్కా అంటున్నారు. మరి ఇదే డేట్ ఫిక్స్ అవుతుందో లేదంటే మరొక్క వారం లేట్ అవుతుందో చూడాలి.