బలగం వేణు స్ఫూర్తి తో మెగా ఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారిన ధనరాజ్ సముద్రఖని అండతో రామం రాఘవం అనే సినిమాను రూపొందించారు. అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ కల్చర్ సినిమాలపై గట్టిగా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో బాపు అనే కథను నమ్మి పారితోషికం కూడా లేకుండా బాపు సినిమాకి పని చేసారు బ్రహ్మాజీ.
ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రామం రాఘవం, ఎప్పుడెప్పుడా అనుకుంటూ వేచి చూసిన బాపు, రెండూ ఒకే రోజు రిలీజ్ అవడం వాళ్లకే చేటు చేసింది. వచ్చి పడ్డాయి రెండు డబ్బింగ్ సినిమాలు. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా, లవ్ టుడే తో ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాధన్ రిటన్ ఆఫ్ ద డ్రాగన్ లు.
విచిత్రమేమిటంటే మనవాళ్ళు చేసిన మన సినిమాల కంటే పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా ఆ సినిమాలపైనే ఆడియన్స్ ఆసక్తి చూపించారు. ఆ సినిమాలకు తెగిన టికెట్స్ లో సగం కూడా మన సినిమాలకు తెగలేదు అంటే మనం నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం.
రాంగ్ రిలీజ్ అని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. రాంగ్ రిలీజ్ అనే వర్డ్ కి ఎక్సాంపుల్ గా చెప్పాలంటే ఈ రెండు సినిమాలనే చెప్పొచ్చు. తండ్రిని చంపాలి అని కొడుకు అనుకోవడం అనే కాన్సెప్ట్ మీదే బేస్ అయిన రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడం ఎంత దెబ్బ కొట్టిందో రెండిటీకి దిక్కు లేకుండా పోయింది. గట్టిగా దెబ్బపడింది. ఇక వీటి ఓటీటీ, శాటిలైట్ గురించి కూడా మాట్లాడుకునే అవసరం లేదు. అంత దారుణంగా దెబ్బతినేసాయి రెండు సినిమాలు.
జాబిలమ్మ నీకు అంత కోపమా సో సో అనిపించుకుంటే, డ్రాగన్ అనే సినిమా కాస్త కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఈ వీక్ రిజల్ట్ అది. నేడు శివరాత్రి. ఈరోజు మజాకా తో మొదలు కాబోతుంది. దానితో ఆ సినిమాల చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. ఈ వీక్ సినిమాల సంగతేమిటో నెక్స్ట్ అప్ డేట్ లో చూద్దాం.