వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం గా ఉన్న చంద్రబాబు ఇల్లు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో జోగి రమేశ్, దేవినేని అవినాశ్ సహా 20 మంది పై కేసు నమోదు అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంపై రాగానే జోగి రమేష్ తో పాటుగా అవినాష్ లపై కేసులు నమోదు అయ్యాయి.
దానితో వారు అరెస్ట్ అవ్వకుండా ముందస్తు బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించారు. హై కోర్టులో ముందస్తు బెయిల్ రిజెక్ట్ అవడంతో జోగి అండ్ బ్యాచ్ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడేళ్లుగా దర్యాప్తు చేయకుండా తాత్సారం చేసారు, అంతేకాదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది.
హైకోర్టు అరెస్ట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు సుప్రీమ్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు, ఇందులో జోక్యం చేసుకోవడానికి తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు, కాబట్టి నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ... వారు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. దానితో అవినాష్ జోగి రమేష్ లతో పాటుగా మరో 20 మంది ముందస్తు బెయిల్ మంజూరైంది.