మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త చైతన్య తో విడిపోయాక తల్లి తండ్రుల దగ్గరే ఉంటుంది. నిర్మాతగానూ, నటి గాను కొనసాగుతున్న నిహారిక కొణిదెల అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వితిక సేరు, మహాతల్లి ఫేమ్ జాహ్నవి లతో కలిసి వెకేషన్స్ కు వెళ్లడమో లేదంటే స్పెషల్ ఫోటో షూట్స్ అంటూ హడావిడి చెయ్యడమో చేస్తుంది.
తాజాగా నిహారిక కొణిదెల సింగిల్ గా శ్రీవారి సేవలో తరించింది. ఈరోజు ఉదయం శ్రీవారి తోమల సేవలో నిహారిక తన స్నేహితులు వితిక ఇంకొంతమంది తో కలిసి పాల్గొంది. నిహారిక శ్రీవారి దర్శనానంతరం ఆమెకి ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం నిహారిక ఆలయం వెలుపలకి వచ్చింది.
సాంప్రదాయంగా నిహారిక రెడ్ డిజైనర్ వేర్ చీర లో అందంగా కనిపించింది. ఆమె స్నేహితులు కూడా ఆమె వెంటే ఉన్నారు.