ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్ లో కథానాయికగా కనిపించబోయే కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ అంటే ఎంతో అభిమానమని.. ఆయనతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో కలలు కన్నానని మాళవిక తెలిపింది.
ఈ సినిమాలో షూటింగ్ ప్రారంభించినప్పుడు ప్రభాస్‌ను చూసిందట. ఆమె ప్రభాస్ వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యానికి గురైందట. ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్ అయ్యాక కూడా ఆయన చాలా సరళంగా అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పింది. సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరితో సరదాగా గడిపే ప్రభాస్ తన టీమ్‌కు ఎంతో గౌరవం ఇస్తారని మాళవిక వెల్లడించింది.
ప్రభాస్ పెద్ద మనసు గల వ్యక్తి అని చెప్పిన మాళవిక ఆయన షూటింగ్ స్పాట్‌లో అందరికీ స్వయంగా మంచి భోజనం అందించడాన్ని గమనించి ఆశ్చర్యపోయానని పేర్కొంది. ప్రత్యేకంగా బిర్యానీని అందరికీ వడ్డించి తన దగ్గరే తినిపించడాన్ని చూస్తే ఎంత మంచివారో అర్థమవుతుందని తెలిపింది. నిజంగా ప్రభాస్ చాలా స్వీట్ అంటూ అతనిపై ప్రశంసలు కురిపించింది.