ప్రస్తుతం సత్యమూర్తి కిడ్నప్ కేసులో విజయవాడ జైల్లో పోలీస్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీ పై మరో కేసు నమోదు అయ్యింది. జైల్లో ఉన్న వల్లభనేని వంశీపై భూ కబ్జా కేసు నమోదు అయ్యింది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు. దానితో వంశీ మరింత ఉచ్చు బిగుసుకుంది.
హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు, వల్లభనేని వంశీతో పాటు మరో 15 మందిపై ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి.. ప్రస్తుతం కస్టడీలో ఉన్న వంశీ పై మరో కేసు నమోదు అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.