SSMB 29 సెట్ లోకి అడుగుపెట్టినప్పుడే మహేష్ పాస్ పోర్ట్ లాక్ చేసినట్టుగా రాజమౌళి ఫన్నీగా చేసిన పోస్ట్ వర్కౌట్ అవుతోంది. ఎందుకంటే మహేష్ రాజమౌళి కండిషన్ ను ఫాలో అవుతున్నారు. తన సినిమా షూటింగ్ లోకి అడుగుపెట్టాక నో వెకేషన్స్, నో ఫ్యామిలీ ఈవెంట్స్ అన్నట్టుగా రాజమౌళి రూల్స్ పని చేస్తున్నాయనిపిస్తుంది.
కారణం టాలీవుడ్ స్టార్లు మొత్తం దుబాయ్ లోని ఓ పెళ్లి వేడుకలో ఎంజాయ్ చేస్తుంటే అక్కడికి మహేష్ మాత్రమే వెళ్ళలేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ తమ భార్యలతో హాజరైతే మహేష్ భార్య నమ్రత సితార ను వెంటబెట్టుకుని ఆ గ్యాంగ్ తో కలిసి ఈ పెళ్లిలో ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ షేర్ చేస్తుంది.
అంతేతప్ప మహేష్ ఈ వేడుకకు హాజరవ్వలేదు. చరణ్, ఎన్టీఆర్, నాగ్, చిరు, వెంకటేష్, ఇంకా చాలామంది సెలెబ్రిటీస్ పాల్గొన్న వేడుకలో మహేష్ కనిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశపరిచినా ఆయన రాజమౌళి సెట్స్ లో ఉండి, రాజమౌళి పెట్టిన కండిషన్ ఫాలో అవుతున్నారని ఆయన అభిమానులే హ్యాపీగా ఫీలవుతున్నారు.