Advertisementt

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా

Mon 24th Feb 2025 08:50 PM
gv reddy  ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా
AP Fibernet Chairman GV Reddy resigns ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా
Advertisement
Ads by CJ

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జీవీ రెడ్డి రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గా వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న ఉద్యోగులను తొలగించినప్పటికీ ఎండీ ఆమోదం తెలపలేదని, ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థను కనుమరుగు చేసేలా వైసీపీ కి సానుకూలంగా పనిచేసే అధికారులు కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయంటూ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా వ్యక్తిగత కారణాలతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధి హోదాకు, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జీవి రెడ్డి సీఎం చంద్రబాబు కి లేఖ రాసారు. తనపై ఉంచిన విశ్వాసానికి, మద్దతుకు, కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాదు ఫ్యూచర్ లో వేరే రాజకీయ పార్టీల్లో చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. 

మరోవైపు ఫైబర్ నెట్ లో వివాదంపై సిఎం వద్దకు నివేదిక చేరింది. ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా దినేష్ కుమార్ కు జీఎడికి రిపోర్ట్ చేయాలని అదేశాలు జారీ చేసారు. 

AP Fibernet Chairman GV Reddy resigns:

GV Reddy has resigned from his position as the Chairman of AP FiberNet 

Tags:   GV REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ