గత వారం సత్యవర్ధన్ కిడ్నప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదు, కిందపడుకోలేను, వెస్టర్న్ బాత్ రూమ్ కావాలి అంటూ వంశీ బెయిల్ కి అప్లై చేసినా వంశీ కి బెయిల్ రాలేదు. ఈలోపు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వంశీని పరామర్శించి వెళ్ళాడు.
తాజాగా వల్లభనేని వంశీ కి బిగ్ షాక్ తగిలింది. వంశీని విచారించేందుకు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు ఇచ్చింది. మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి అనుమతించింది. అంతేకాకుండా పోలీసులకు వంశీ విచారణలో కోర్టు కొన్ని షరతులు విధించింది.
న్యాయవాది సమక్షంలో వంశీ విచారణకు జరగాలి, అలాగే వంశీ విచారణ విజయవాడ పరిధిలోనే జరగాలని కోర్టు తెలిపింది.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణకు అనుమతినిచ్చింది. అయితే ఈ విచారణలో వంశీకి లభించిన ఊరట ఏమిటంటే వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీకి పడుకోవడానికి బెడ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.