జబర్దస్త్ లో కామెడీ చెయ్యడమే కాదు వెండితెర మీద వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ వేణు, ధనరాజ్ లాంటి వాళ్లు నటులుగానే కాదు దర్శకులుగా ప్రూవ్ చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే కమెడియన్ వేణు బలగం చిత్రంతో దర్శకుడిగా మారటమే కాదు మొదటి చిత్రం తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.
దిల్ రాజు బ్యానర్ నుంచి వేణు దర్శకుడిగా లాంచ్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. తన తదుపరి చిత్రాన్ని ఎల్లమ్మగా నితిన్ తో చెయ్యడానికి వేణు సిద్ధంగా ఉన్నాడు, మరో కమెడియన్ ధనరాజ్ కూడా రామం-రాఘవం చిత్రంతో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఎమోషనల్ గా రామం రాఘవం ఓ వర్గం ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది.
కానీ చాలామందికి ఈ చిత్రం అంతగా ఎక్కలేదు, అటు క్రిటిక్స్ కూడా రామం రాఘవం చిత్రానికి సో సో రేటింగ్స్ ఇవ్వడమే కాదు.. ఈవారం ఈ చిత్రంతో పాటుగా బాక్సాఫీసు బరిలోకి వచ్చిన రెండు తమిళ చిత్రాలు రామం రాఘవం పై చెయ్యి సాధించడం ఈచిత్రానికి మైనస్ గా మారింది.
మరి మొదటి వారం కలెక్షన్స్ చూస్తేనే రామం రాఘవం ఏమిటి అనేది తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రామం రాఘవం అంతగా ప్రభావం చూపలేకపోయింది అనే చెప్పాలి.