హీరో సందీప్ కిషన్ కొన్నాళ్లుగా సక్సెస్ లేక అల్లాడుతున్న హీరో. వరసగా సినిమాలు చేస్తున్నాడు, అవకాశం వస్తే ఇతర భాషల్లోనూ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాడు.. అయినా ఈ యువ హీరోకు విజయం దక్కడం లేదు. ఊరి పేరు భైరవ కోన పర్వాలేదనిపించినా ప్రస్తుతం సందీప్ కిషన్ నుంచి వస్తున్న సినిమాలకు మినిమమ్ బజ్ కనిపించడం లేదు.
కానీ ఆయన లేటెస్ట్ చిత్రం మజాకా పై మాత్రం ఆడియన్స్ లో ఆసక్తి కనిపిస్తుంది. రావు రమేష్ తో కలిసి సందీప్ కిషన్ కామెడీ ఎంటర్టైనర్ గా చేసిన మజాకా మహాశివరాత్రి స్పెషల్ గా విడుదలకు సిద్ధమైంది. మరి ఈచిత్రంతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఈ హీరో మజాకా ను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.
ఈమధ్యన మీడియం రేంజ్ సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ కనిపించడం లేదు. సినిమా విడుదలై హిట్ అయితే తప్ప ఆడియన్స్ థియేటర్స్ కి కదలడం లేదు. అలాంటి సమయంలో సందీప్ కిషన్ పెయిడ్ ప్రీమియర్స్ తో సాహసం చేస్తున్నాడా అనిపించేలా మజాకా చిత్రం రేపు అంటే విడుదలకు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందు రాబోతున్నాడు.
ఒకవేళ ప్రీమియర్ టాక్ బావుంటే మజాకా ఓపెనింగ్స్ అదిరిపోతాయి, అదే టాక్ తేడా కొడితే మజాకాకు మినిమమ్ ఓపెనింగ్స్ రావడం కష్టమే. చూద్దాం సందీప్ కిషన్ లక్కు ఎలా ఉందొ అనేది.