కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నాగ చైతన్య కు చందు మొండేటి తండేల్ తో బిగ్ సక్సెస్ ఇచ్చారు. థాంక్యూ, కస్టడీ ఇలా వరసగా నిరాశపరిచే సినిమాలతో అక్కినేని ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన నాగ చైతన్య కు తండేల్ సక్సెస్ బిగ్ రిలీఫ్ నిచ్చింది. నానితో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.
నాగార్జున అయితే కొత్త కోడలు శోభిత అక్కినేని ఇంట అడుగుపెట్టిన వేళా విశేషం నాగ చైతన్య కు తండేల్ తో సక్సెస్ వచ్చింది అంటూ మురిసిపోయారు. నాగ చైతన్య కూడా తండేల్ సక్సెస్ ని ఆస్వాదిస్తున్నాడు. తన తండేల్ టీంతో పాటుగా ఇంకా కొంతమంది దర్శకనిర్మాతలకు నాగ చైతన్య బిగ్ పార్టీ ఇచ్చాడు.
ఆదివారం రాత్రి ఫిల్మ్ నగర్ దగ్గర The Sanctuary Bar and Kitchen పబ్ లో నాగ చైతన్య భారీ పార్టీ ఇచ్చిన విషయం వైరల్ అయ్యింది. ఈ పార్టీ లో నిర్మాతలు స్వప్న, నాగవంశీ, అరవింద్, బన్నీ వాస్, సుప్రియ, బాపినీడు, దర్శకులు కార్తీక్ దండు, చందు మొండేటి తో పాటుగా గీతా కాంపౌండ్ సన్నిహితులు, ఇంకా కొంతమంది సినిమా సెలబ్రిటీలు హాజరైనట్లుగా తెలుస్తోంది.