ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలు కాస్త ఊరటనిచ్చినట్లే కనిపిస్తుంది. నాగ చైతన్య ఫిబ్రవరి 7 న తండేల్ తో హిట్ కొట్టాక గత వారం విడుదలైన లైలా లాంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. ఈ వారం కూడా కొన్ని చిన్న తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో పాటుగా రెండు డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీసు బరిలోకి వచ్చాయి.
అందులో నటుడు బ్రహ్మాజీ నటించిన బాపు, కమెడియన్ ధనరాజు నటించి దర్శకత్వం వహించిన రామం రాఘవం వంటి తెలుగు చిత్రాలతో పాటుగా ధనుష్ నటించిన జాబిలమ్మ నీకు అంత కోపమా, లవ్ టు డే హీరో ప్రదీప్ రంగరాజన్ డ్రాగన్ చిత్రాలు విడుదలయ్యాయి. బాపు, రామం రాఘవం చిత్రాలు సో సో టాక్ తో సరిపెట్టుకున్నాయి.
కానీ డబ్బింగ్ చిత్రాలైన జాబిలమ్మ నీకు అంత కోపమా, డ్రాగన్ చిత్రాలకు యావరేజ్ టాక్ రావడం, క్రిటిక్స్ కూడా యావరేజ్ కంటే బెటర్ రివ్యూస్ ఇవ్వడం కాస్త కలిసొచ్చేలా ఉంది. ఏదైనా ఈవారం టాలీవుడ్ లో తెలుగు చిత్రాల కన్నా డబ్బింగ్ చిత్రాల హవానే కనిపించింది. మరి ప్రేక్షకులు వాటికి ఎలాంటి కలెక్షన్స్ ఇస్తారో కాస్త వేచి చూడాల్సిందే.