యంగ్ టైగర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆయన అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. రాఖీ చిత్రంలో ఎన్టీఆర్ ని అలా చూసాక బాగా డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ యమదొంగ, టెంపర్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ అవుతూనే ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అమాయకంగా భీమ్ పాత్రలో కనిపించిన ఎన్టీఆర్, దేవర చిత్రంలో దేవర కేరెక్టర్ లో అద్దరగొట్టేసారు.
ఇక ఆయన హిందీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న వార్ 2 లో రా ఏజెంట్ గా యుగంధర్ పాత్రలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తారనే టాక్ ఉంది. మరోపక్క ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను నీల్ చిత్రీకరిస్తున్నారు. మరో వారం పది రోజుల్లో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు.
తాజాగా ఎన్టీఆర్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టైలిష్ గా ఎన్టీఆర్ కూలింగ్ గాగుల్స్ పెట్టుకుని కూల్ గా కనిపించారు. బ్లాక్ సూట్ లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.