Advertisementt

ఆసుపత్రి బెడ్ పై పవన్ కళ్యాణ్

Sun 23rd Feb 2025 09:15 AM
pawan kalyan  ఆసుపత్రి బెడ్ పై పవన్ కళ్యాణ్
Medical Tests On Pawan Kalyan ఆసుపత్రి బెడ్ పై పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ నడుం నొప్పితో బాధపడుతున్నారు. ఆ కారణంగానే ఈమధ్యన ఏపీ క్యాబినెట్ సమావేశాలకు పవన్ హాజరవ్వలేకపోయారు. ఈలోపు కాషాయ వస్త్రాలు ధరించి ఆయన దేవాలయాల బాట పట్టారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న పిక్స్ చూసి పవన్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. 

పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునెందుకు ఆసుపత్రికి వెళ్లారు. అపోలో డాక్టర్స్ పవన్ కళ్యాణ్ కు అన్ని టెస్ట్ లు అంటే స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లుగా తెలుస్తుంది. 

దానికి సంబందించిన వైద్య పరిక్షలను పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ చేయించుకొంటారు. రేపటినుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారని జనసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు రిలాక్స్ అవుతున్నారు. 

Medical Tests On Pawan Kalyan :

Medical Tests On Pawan Kalyan at Apollo Hospital

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ