నిన్నటివరకు ప్రతిపక్ష హోదా లేనిదే అసెంబ్లీ లో అడుగుపెట్టను అంటూ శపధాలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొనబోతున్నాడు. అసెంబ్లీ లో ప్రతి పక్షబలం లేదు అయినా తనకి ప్రతిపక్ష హోదా కావాలంటూ స్కూల్ పిల్లాడు మారం చేసినట్టుగా జగన్ మారం చేసినా కూటమి ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. దానితో జగన్ అసెంబ్లీ మెట్లక్కను అని పట్టుబట్టాడు.
అసలు కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వను అని ఎక్కడా చెప్పక పోయినా జగన్ ప్రజల సింపతీ కోసం ప్రాకులాడాడు, అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా బెంగుళూరు ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అసెంబ్లీకి వెళ్లినా మైక్ ఇవ్వరు, అందుకే ప్రజల తరుపున పోరాటం చేస్తాను, నేను ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అన్నాడు.
కానీ ఇప్పుడు మనసు మార్చుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నాడు. ఇంతలోనే జగన్ లో అంత మార్పు ఏల అంటూ వైసీపీ నేతలు ఆశ్చర్యపోతుంటే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకపోతే అనర్హత వేటు పడుతుంది అని బెదిరించారు, అందుకే జగన్ భయపడ్డాడు అంటుంటే, కాదు జగన్ ఈమధ్యన ప్రజల పక్షాన పోరాడుతుంటే ప్రజాధారణ పెరుగుతుంది అందుకే జగన్ మనసు మార్చుకుని అసెంబ్లీకి హాజరవుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.