లక్కీ భాస్కర్ లో భార్య గా, తల్లి గా మీనాక్షి చౌదరి నటనను మెచ్చుకోని తెలుగు ప్రేక్షకుడు లేడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో పోటీ పడి నటించిన మీనాక్షి చేసిన సుమతి పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. కానీ మీనాక్షి చౌదరి మాత్రం కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి భార్య, తల్లి పాత్ర పోషిస్తే ఇక మీదట అలాంటి పాత్రలకే పరిమితమవుతానేమో అని కంగారు పడింది.
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేష్ కి గర్ల్ ఫ్రెండ్ గా, పోలీస్ అధికారిగా సాదా సీదా పాత్ర చేసినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం మీనాక్షి చౌదరికి బాగా హెల్ప్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండీ లుక్స్ తో మెస్మరైజ్ చేసే మీనాక్షి చౌదరి తాజాగా ఆకుపచ్చ చీరలో అద్దరగొట్టేసింది.
చీర కట్టులో సింప్లి సూపర్బ్ అనేలా మీనాక్షి లేటెస్ట్ లుక్ ఉంది. గ్రీన్ శారీ, డిజైనర్ బ్లౌజ్ లో మీనాక్షి సైడ్ లుక్ చూసి యూత్ మొత్తం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మీనాక్షి చేతిలో తెలుగులో నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు చిత్రం మాత్రమే ఉంది.