ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 21 న నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబో డాకు మహారాజ్ చిత్రం టాప్ 1 లో ట్రెండ్ అవడం నందమూరి అభిమానులకు పట్ట పగ్గాలు లేకుండా చేసింది. జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన డాకు మహారాజ్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
మాస్ ఆడియన్స్ ను డాకు మహారాజ్ బాగా ఇంప్రెస్స్ చెయ్యగా.. ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకు వెంకటేష్ ఫ్యామిలీ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం డాకు మహారాజ్ కి మైనస్ అయ్యింది. అయినప్పటికీ అన్ని ఏరియాస్ లో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతను ఒడ్డున పడేసింది.
ఇక థియేటర్స్ లో విడుదలైన ఐదు వారాల గ్యాప్ తో డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి రాగా.. ఇక్కడ ఓటీటీలోనూ డాకు మహారాజ్ విధ్వంశం సృష్టిస్తుంది. పాన్ ఇండియా భాషల్లో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అదరగొడుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ గా డాకు మహారాజ్ ట్రెండ్ అవుతుంది. ఓటిటిలో వచ్చాక డాకు మహారాజ్ ఆడియెన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది.