గత పదేళ్లుగా నేనిక్కడే ఉంటాను, నాది తాడేపల్లె, నేను గెలిస్తే ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాను. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు గెలిస్తే హైదరాబాద్ నుంచి పాలన చేసారు, వాళ్లకు ఏపీలో ఇళ్లు కూడా లేవంటూ వైసీపీ నేతలే కాదు సాక్షత్తు వైసీపీ అధ్యక్షుడు జగన్ పదే పదే ఏపీ ప్రజల చెవుల్లో శంఖం ఊదుకుంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు అమరావతిలో, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నివాసమేర్పరచుకుని ఏపీలో ప్రభత్వాన్ని నడిపిస్తున్నారు.
2024 ఎన్నికల్లో ఓడిపోవడమే జగన్ తన దుకాణాన్ని తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగుళూరు ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేసాడు. ఏదైనా అవసరం(వైసీపీ నేతలెవరైనా జైలుకెళితే వాళ్ళను పరామర్శించదునైకి) వస్తే తప్ప అక్కడినుంచి రాడు, అప్పుడుడప్పుడు విజయవాడ వచ్చి వెలుతున్నారు తప్ప బెంగుళూరు ప్యాలెస్ వదలడం లేదు. అత్యవసరమైతే వైసీపీ నేతలు బెంగుళూరు వెళ్లి జగన్ ను కలిసి వస్తున్నారు.
రీసెంట్ గా జగన్ వల్లభనేని వంశీని జైల్లో ఓదార్చేందుకు విజయవాడ జైలుకి వెళ్లి పని పూర్తికాగానే బెంగుళూరుకు పయనమవడం చూసిన వాళ్ళంతా.. ఇంకేంటి జగన్ బెంగుళూరు ప్యాలెస్ లో సేదతీరుతాడు, మీరు జగన్ వచ్చేవరకు రిలాక్స్ అవ్వండి అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.