సినీ నటుడు పృథ్వీ లైలా సినిమా ఫంక్షన్ లో రాజకీయాలపై కామెంట్స్ చేసి వైసీపీ వాళ్ళను బాగా హార్ట్ చేసాడు. దానితో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నటుడు పృథ్వీ కి చుక్కలు చూపించారు. పృథ్వీ వలన సినిమాను ఆడనివ్వమంటూ బెదిరించారు, ఫోన్స్ తో విసిగించారు. నిర్మాతల కోసం దిగొచ్చిన నటుడు పృథ్వీ ఇకపై సినిమా ఈవెంట్స్ లో రాజకీయాలపై కామెంట్స్ చెయ్యను అంటూ సారీ చెప్పాడు.
ఈ ఉదంతంలో పృథ్వీ హై బిపి తో ఆసుపత్రి పాలయ్యాడు. ఇక పృథ్వీ లైలా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో ఆ సినిమాకి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు, అసలు ఆ సినిమా ప్రేక్షకుల్లో వర్కౌట్ అవ్వలేదు. తాజాగా పృథ్వి మరోసారి రాజకీయాలను కెలికాడు.
నేను నా భావాలను సినిమా స్టేజ్ పై వ్యక్తపరుస్తుంటే చాలామంది హార్ట్ అయ్యి ఫీలవుతున్నారు. అందుకే ఇకపై నేను నా భావాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరుస్తాను అంటూ X లోకి ఎంటర్ అయ్యాడు. దానితో బ్లూ మీడియా అదేదో అప్పుడే చేయొచ్చుగా, ట్రోల్ అయ్యాక బుద్ధోచ్చిందా అని కామెంట్స్ చేస్తున్నారు.