ఒకప్పుడు వేసవి సెలవలు ముందు అంటే మార్చి లో 10th, ఇంటర్ ఎగ్జామ్స్ అవ్వడం పాపం భారీ బడ్జెట్ సినిమాలు, సార్ హీరోల సినిమాలు విడుదలకు క్యూ కట్టేవి. వేసవి సేలవలను క్యాష్ చేసుకోవడానికి తహతహలాడేవి. కానీ గత మూడేళ్ళుగా వేసవి సెలవల్లో సినిమాలు విడుదల చేసేందుకు మేకర్స్ ముందుకు రావడం లేదు.
కారణం IPL మ్యాచ్ లు. మార్చ్ లో మొదలై మే ఎండింగ్ వరకు IPL సీజన్స్ ఉంటున్నాయి. సాయంత్రం అయితే చాలు యూత్ మొత్తం టీవీలకు లేదంటే ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు తప్ప సినిమాలకు వెళ్లే మూడ్ లో ఉండడం లేదు. మరోపక్క ఒక్కో హీరో సినిమాలు చెయ్యడానికి మూడేళ్లకు పైగా సమయం తీసుకుంటున్నారు.
నాన్చుతూ షూటింగ్ చేసి.. చివరికి విడుదల సమయానికి హరీబరిగా పరుగులు పెడుతున్నారు. కల్కి దగ్గర నుంచి దేవర వరకు, చివరికి పుష్ప సినిమా విడుదలయ్యేవరకు దర్శకులు పోస్ట్ ప్రొడక్షన్ లోనే కనిపించారు తప్ప కూల్ గా కనబడలేదు. ఇటు క్రికెట్ ఫీవర్ తో వేసవి సెలవలను దర్శకనిర్మాతలు, హీరోలు గాలికి వదిలేస్తున్నారు.
ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్, మే లో క్రేజీ మూవీస్ ఏవి విడుదలయ్యేందుకు సిద్ధంగా లేవు. మళ్లీ ఆగష్టు, లేదంటే దసరా వరకు పెద్ద సినిమాల హడావిడి కనబడడం లేదు.