విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో ఓ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సైంధవ్ అనే యాక్షన్ మూవీ భారీగా నిరాశపరిచింది. ఈ ఫలితంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై మళ్లీ ఆలోచనలో పడ్డారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ డబుల్ బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఇకపై పూర్తిగా కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే చేయాలని వెంకటేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్ తీసుకున్న ఈ కొత్త స్ట్రాటజీ ఆయన అభిమానులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. కొన్ని కథలు కొన్ని హీరోలకు మాత్రమే సరిపోతాయి. అలానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ విషయంలో వెంకటేష్‌కు ఏకంగా ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. వెంకటేష్ ఎమోషనల్ డ్రామా కుటుంబ సంబంధిత కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ముందుకు సాగుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయంతో వెంకటేష్ మరిన్ని కుటుంబ కథా చిత్రాల వైపు మళ్లారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమాపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు దర్శకులతో చర్చలు జరుగుతుండగా చివరికి ఏ దర్శకుడిని ఎంపిక చేస్తారనేది త్వరలో తెలియనుంది. అంతేకాదు వెంకటేష్ ప్రతి ఏడాది సంక్రాంతికి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ప్రేక్షకులకు అందించాలనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కాబట్టి రాబోయే చిత్రాల్లో ఏదైనా మల్టీస్టారర్ మూవీ ఉందా లేక పూర్తిగా సోలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకే ఫిక్స్ అయ్యారా అన్నది ఆసక్తిగా మారింది. కానీ వెంకటేష్ ఏ చిత్రాన్ని తీసుకున్నా ఆయన సినిమాలు విడుదలైతే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారనేది మాత్రం ఖాయం. సంక్రాంతికి వస్తున్నాం హిట్‌తో వెంకటేష్ మరింత ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.