సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీ రాక పై ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. ముందుగా ఓటీటీలోకి వస్తుందా, లేదంటే బుల్లితెర మీదకి వస్తుందా అనే విషయంలో కుటుంబ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుతో జీ 5 డిజిటల్, శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. అయితే సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, డాకు మహారాజ్ రేపటినుంచి నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది. కానీ సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ డేట్ కానీ, టీవీ ప్రీమియర్స్ డేట్ కానీ ఇవ్వడం లేదు.
జీ 5 ఓటీటీలో కమింగ్ సూన్ అంటూ వెయ్యడం, ఇటు జీ తెలుగులో కమింగ్ సూన్ అంటున్నారు తప్ప క్లారిటీ ఇవ్వడమే లేదు. ఈలోపు జీ 5 ఓ పోస్ట్ పెట్టింది. ఏమండోయ్ వాళ్ళు వస్తున్నారు, కూసింత చమత్కారం, మరిన్ని వివరాల కోసం వేచి చూడండి, త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తామంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను అయోమయంలో పడేసింది.