కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్‌కు చెందిన రూ. 10.11 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ప్రకటించారు. రోబో సినిమా కథను కాపీ కొట్టారని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఈడీ, తన కథను శంకర్ కాపీ కొట్టారని 2011లో తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ కేసు పెట్టడంతో ఆ కేసు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ.
ఆరూర్ కథకు, రోబో కథకు పోలికలు ఉన్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్పడమే కాదు కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించారని ఈడీ కన్ ఫర్మ్ చేసింది.
రోబో సినిమా కోసం రూ. 11.5 కోట్ల రెమ్యూనరేషన్‌ను శంకర్ తీసుకున్నట్లు ఈడీ ఆరోపణ చేసింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా రోబో సినిమా రూ. 290 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.