మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతుల పెళ్లి రోజు వేడుకలు స్పెషల్ ఫ్లైట్ లో నేడు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. మెగాస్టార్ చిరు - సురేఖ లతో పాటుగా ఈ వేడుకల్లో నాగార్జున, అమల, ఇంకా మహేష్ భార్య నమ్రతతో పాటుగా చిరు ఫ్రెండ్స్ పాల్గొన్నారు. చిరు దంపతులకు పూల బొకే తో శుభాకాంక్షలు తెలియజేశారు.
స్పెషల్ ఫ్లైట్‌లోనే చిరు - సురేఖ జంటతో ప్రత్యేకంగా కేక్ కట్ చేయించారు. ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ మెగాస్టార్ భార్య సురేఖని విష్ చేసారు. నా భాగస్వామిగా సురేఖ నా లైఫ్ లోకి వచ్చినందుకు నేనెప్పుడూ లక్కీగా ఫీలవుతూ ఉంటాను. ఆమె నా ధైర్యం, నా బలం, ప్రపంచంలో ఎన్నో తెలుసుకోవడానికి సురేఖనే హెల్ప్ చేసింది. ఆమె అంతగా అన్ని నాకు వివరించి చెబుతుంది.
సురేఖ అంటే ఎంతిష్టమో తెలియజేసేందుకు ఈ క్షణాలను నేను సద్వినియోగపరుచుకుంటున్నాను, థాంక్యూ మై లైఫ్ పార్ట్నర్ సురేఖ, నా పెళ్ళిరోజు కు శుభాకాంక్షలు తెలియజేసిన బంధుమిత్రులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చిరు షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.