పవన్ కళ్యాణ్ తో చెయ్యాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడడంతో దర్శకుడు హరీష్ శంకర్ రవితేజా తో కలిసి మిస్టర్ బచ్చన్ మూవీ చేసాడు. ఆ సినిమా రిజల్ట్ అటు హరీష్ శంకర్ ను ఇటు రవితేజ ను బాగా ఇబ్బంది పెట్టింది. ఆతర్వాత హరీష్ శంకర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి.
అప్పటి నుంచి హరీష్ శంకర్ చాలా సైలెంట్ గా ఉన్నాడు. అయితే మిస్టర్ బచ్చన్ తర్వాత హరీష్ శంకర్ హీరో రామ్ తో మూవీ కమిట్ అయ్యాడు. అటు రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ మూవీని కన్ ఫర్మ్ చేసాడు. హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్ ఒకే రోజు విడుదలై నిరాశపరిచే రిజల్ట్ ఇచ్చాయి.
దానితో రామ్-హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పై నీలి నీడలు కమ్ముకోవడం కాదు, ఆగిపోయింది అనే ప్రచారం నడిచింది. తాజాగా రామ్ తో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఓకె అయ్యింది అనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. రామ్ ప్రస్తుతం సాగర్ దర్శకత్వంలో RAPO 22 షూటింగ్ లో బిజీగా వున్నాడు. మరి రామ్-హరీష్ శంకర్ మూవీ ఎప్పడు పట్టాలెక్కుతుందో చూడాలి.