సౌత్ లో క్రేజీ హిట్స్ కొట్టకపోయినా.. ధమాకా దెబ్బకు శ్రీలీల బిజీ తారగా మారిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరోలతో వరస సినిమాలు చేస్తూ ఊపిరి కూడా ఆడని శ్రీలీలకు గత ఏడాది సినిమాలు బ్రేకిచ్చేలా చేసింది. గత ఏడాది పుష్ప 2 లో చేసిన కిస్సిక్ సాంగ్ తో బౌన్స్ బ్యాక్ అయిన శ్రీలీల ఆ తరవాత కోలీవుడ్ లోకి, బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది అన్నారు.
కానీ ముందుగా అమ్మడు హిందీలోకి ఎంట్రీ ఇస్తుంది. క్రేజీ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల బాలీవుడ్ మూవీ కోసం ముంబై వెళ్ళింది. ఈ చిత్రంలో శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ కు గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుంది. అయితే ఈచిత్రంలో నటిస్తున్నందుకు గాను శ్రీలీల పారితోషికము ఎంత అందుకుంటుందో తెలుసా..
జస్ట్ 1.75 కోట్ల పారితోషికం శ్రీలీలకు సెట్ చేసారని తెలుస్తుంది. మరి శ్రీలీల కష్టానికి బాలీవుడ్ కట్టిన వెల 1.75 కోట్లు. సౌత్ లోనే దాదాపుగా 2.5 నుంచి 3 కోట్ల పారితోషికం అందుకుంటున్న శ్రీలీల కి బాలీవుడ్ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ చాలామంది షాకవుతున్నారు. కానీ శ్రీలీల మాత్రం హిందీలో ఒక్కసారి సక్సెస్ అయితే చాలు ఎంతిచ్చినా సరిపోతుంది అనే ఫీలింగ్ లో ఉన్నట్లుగా చెప్పకుంటున్నారు.