కన్నడ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ.. ఎప్పుడో అనౌన్స్ చేసేసింది మైత్రి మూవీస్ సంస్థ. ఎన్టీఆర్-నీల్ న్యూక్లియర్ బ్లాస్ట్ అంటూ అంచనాలు రేపింది. మధ్య మధ్యలో ఎన్టీఆర్-నీల్ కలిసి పెళ్లి రోజు జరుపుకోవటం, లేదంటే కర్ణాటకలోని ప్రసిద్ధి దేవాలయాలను సందర్శించడం చేస్తూ ఈ కాంబోపై క్రేజ్ పెంచేశారు.
గత ఏడాది ఆగష్టు లో ఎన్టీఆర్-నీల్ మూవీ అఫీషియల్ గా పూజ కార్యక్రమాలను జరుపుకుంది. అప్పటి నుంచి ఇదిగో ఎన్టీఆర్ - నీల్ సెట్స్ మీదకి వెళుతున్నారు, అదిగో ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ మొదలవుతుంది అనే ప్రచారానికి దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. 2025 జనవరి నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మొదలవుతుంది అని చెప్పారు.
కానీ జనవరి వెళ్ళింది, ఫిబ్రవరి కూడా సగం పూర్తవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. ఎట్టకేలకు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కి సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్టు పైకి వెళుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా వేసిన భారీ సెట్ లో ఎన్టీఆర్-నీల్ కాంబో మూవీ షూటింగ్ మొదలవుతుంది.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో ఉన్నారు. ఓ పది రోజుల తర్వాత నీల్ మూవీ సెట్స్ లోకి ఆయన రావొచ్చు, ఈలోపు నీల్ ఎన్టీఆర్ లేని సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక టెన్షన్ వదిలి రిలాక్స్ అవ్వండి.