ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక, పీఎం నరేంద్రమోడీ ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరికి ఇవ్వాల్సిన గౌవరం ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్క విషయంలోనూ ఏపీకి ప్రయారిటీ ఇస్తున్నారు. మోడీ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్రానికి ఏమిచ్చినా, అందులో ముందు వరసలో ఆంధ్ర ఉంటుంది. NDA లో భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం ఒప్పందానికి మోడీ అంత విలువ ఇస్తున్నారు.
మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరికి వారే కీలకంగా కనిపిస్తున్నారు. తాజాగా ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని హై లెవల్ కమిటీ రూ.608.08 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. గతేడాది ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన ఏపీకి కేంద్రప్రభుత్వం భారీ సహాయం ప్రకటించడమే కాదు ఏపీకి రూ.608.08 కోట్లు కేటాయించారు.
ప్రకృతి విపత్తు బాధిత రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించిన రూ.1554.99 కోట్లలో ఏపీకి రూ.608.08 కోట్లు ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.