కొద్దిరోజులుగా సౌత్ లో కనిపించని తమన్న భాటియా.. కెరీర్ డల్ అవ్వగానే హిందీ పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ అవకాశాలు రాగానే గ్లామర్ డోస్ పెంచేసింది. సౌత్ లో గ్లామర్ రోల్స్, అలాగే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కనిపించిన తమన్నా బాలీవుడ్ లో మాత్రం టూ మచ్ గ్లామర్ తోనే హైలెట్ అవ్వాలనుకుంటుంది.
నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న తమన్నా పెళ్లి విషయమెత్తితే ఫైర్ అవుతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. తమన్నా తెలుగులో సంపత్ నంది దర్శకత్వంలో ఓదెల 2 లో నటిస్తుంది. ఆ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది అప్ డేట్ లేదు.
ముంబైలో తమన్నా హాజరయ్యే పార్టీ ల్లోనూ, అలాగే ఈవెంట్స్ కు అందాలు ఆరబోసే డ్రెస్సింగ్ స్టయిల్ తో అదరగొడుతున్న తమన్నా గ్లామర్ షో గురించి నెటిజెన్స్ రకరాలుగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా వదిలిన పిక్ కూడా తమన్నా గ్లామర్ ని హైలెట్ చేసేదిగా ఉంది. తమన్నా న్యూ లుక్ చూసి అవకాశాల కోసం తమన్నా పాట్లు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.