రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం పాన్ ఇండియా ఆడియన్స్ నే కాదు, మెగా అభిమానులను కూడా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు దర్శకత్వంలో RC 16 పెద్ది(వర్కింగ్ టైటిల్) తో మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది చిత్రం తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ తో సినిమా అనౌన్స్ చేసారు.
RC 17 గా ఉండబోతున్న ఈ చిత్రం పై అప్పుడే క్రేజీ న్యూస్ లు వెలువడుతున్నాయి. గేమ్ చేంజర్ లో తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించారు రామ్ చరణ్. ఇప్పడు RC 17 లోను రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చరణ్-సుకుమార్ కాంబో చిత్రం పక్కా యాక్షన్ ప్యాక్డ్ చిత్రమని, సుకుమార్ గత చిత్రాలకు పూర్తి డిఫ్రెంట్ గా RC 17 ఉంటుందని.. సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ డిఫరెంట్ జోనర్ ని సుకుమార్ స్టయిల్లో మాస్ కోణంలో చూపించబోతున్నారని అంటున్నారు. చరణ్ డ్యూయెల్ రోల్ లొ మాస్ గా ట్రీట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతుందో కానీ.. ఈ న్యూస్ చూసి మెగా ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.