బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలైన దేవా చిత్ర రిజల్ట్ నిరాశపరిచినా.. ప్రస్తుతం పూజ హెగ్డే టైమ్ నడుస్తుంది. సౌత్ లో అందులోను తమిళ ఇండస్ట్రీలో వరస సినిమాలతో బిజీ తారగా మారిన పూజ హెగ్డే స్టార్ హీరో సూర్యతో కలిసి రెట్రో మూవీతో పాటుగా విజయ్ హీరోగా రాబోతున్న జన నాయగన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.
ప్రస్తుతం టాలీవుడ్ దర్శకనిర్మాతలు పట్టించుకోకపోయినా.. అమ్మడు కోలీవుడ్ లో సక్సెస్ అయితే మళ్లీ తెలుగు అవకాశాలు క్యూ కడతాయి అనే హోప్స్ పెట్టుకుంది. అందుకే సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తుంది. రీసెంట్ గా శారీ లో మెరిసింది. పింక్ బ్లౌజ్ లో క్రేప్ శారీ లో పూజ హెగ్డే లుక్ చూస్తే యూత్ కి మతిపోవడం ఖాయం.
బుట్టబొమ్మలా నవ్వుతూ కనువిందు చేసింది. ట్రెండీ హెయిర్ స్టయిల్ తో పూజ హెగ్డే సింపుల్ గానే కనిపించినా ఆమె గ్లామర్ లుక్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన ఆమె అభిమానులు వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.