ఈరోజు బెంగుళూర్ నుంచి విజయవాడ వచ్చి వైసీపి నేత వల్లభనేని వంశీ ని జైల్లో పరామర్శించిన జగన్ మోహన్ రెడ్డి అక్కడి నుంచి బయటకొచ్చి మీడియా సమావేశంలో మట్లాడారు. చంద్రబాబు కన్నా వంశీ ఎదిగిపోతున్నాడని కక్ష కట్టి, ఈర్ష్యతో వంశీని అక్రమ కేసులో అరెస్ట్ చేసారు, బాబు కన్నా, లోకేష్ కన్నా వంశీ, కొడాలి నాని బాగున్నారు, అంతేకాదు అవినాష్ కూడా లోకేష్ కన్నా బావున్నాడు. అందుకే చంద్రబాబు పగబట్టారు, కేసులు పెడుతున్నారంటూ తిక్కతిక్కగా మాట్లాడారు జగన్.
టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదులో సత్యవర్థన్ నుంచి పోలీసులు సేకరించిన స్టేట్ మెంట్ లో కానీ, వంశీ తప్పు చేసినట్టులేదు,లేదు, అందులో ఎక్కడా వంశీ పేరే లేదు, అయినా కూడా వంశీపై కక్షగట్టిన చంద్రబాబు ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
ఎప్పటికి టీడీపీనే అధికారంలో ఉండదు, వచ్చే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము ఈ విషయాన్ని పోలీసులు, అధికారులు గుర్తు పెట్టుకోవాలి, తప్పు చేసిన పోలీసులు తాము అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి సమాధానం చెబుతాము, టీడీపీ నేతలకు సెల్యూట్ చేసే అధికారులను మాత్రం వదిలిపెట్టేది లేదని జగన్ హెచ్చరించారు.